Restaurant style Chicken Gravy Curry Recipe in Telugu

 హోటల్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ

Non-Veg వంటకాలలో చికెన్ కు వున్న ప్రత్యేకతే వేరు. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తేడా లేకుండా చికెన్ అందరికి ఏంతో ఇష్టమైన వంటకం. ఆదివారం వారం వచ్చిందంటే కోడి కూర కూయందే.. sorry.. అదేనండి కోడి కూర వండందే.. ఏ ఇల్లు వుండదేమో అనిపిస్తుంది. చికెన్ లో వున్నన్ని వెరైటీలు దాదాపుగా మరే కూరకి వుండవేమో అంటే అతిశయోక్తి కాదు. రుచిలోను, పోషకాలలోను మిన్నగా వుండే ఈ చికెన్ అందరికి అందుబాటు ధరలో వుండి, మాంసాహార ప్రియులకు ఎప్పుడు ఫేవరెట్ డిష్ గా వుంటుంది.

చికెన్ లో వున్నవెరైటీలను ఒకసారి పరిశీలిస్తే..

చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, , చెల్లి చికెన్, చికెన్ 65, బట్టర్ చికెన్, తందూరి చికెన్, బోన్ లెస్ చికెన్, లాలి పాప్ చికెన్, జాయింట్ చికెన్, పుదినా చికెన్, బొంగులో చికెన్ (bamboo chicken), చికెన్ టిక్కా, చికెన్ సూప్, చికెన్ పకోడీ, చికెన్ wings, grilled చికెన్, చికెన్ పచ్చడి ఇవే కాకుండా ఇంకా చికెన్ తో వండే బిర్యానీలు గురించి చెప్పక్కర్లేదు. చికెన్ బిర్యాని, చికెన్ ధం బిర్యాని, చికెన్ fry బిర్యాని, కుండ బిర్యాని, బొంగులో చికెన్ బిర్యాని.. ఇంకా.... ఎన్నో వెరైటీలు...

తిన్న కొద్ది తినాలనిపించే హోటల్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి

కావాల్సిన పదార్ధాలు :

750 గ్రాముల చికెన్

పసుపు

కారం

ఉప్పు

నిమ్మరసం

అల్లం

బట్టర్

హోల్ గరం మసాలా

ఆయిల్

దాల్చిన చెక్క

పెరుగు – 2 కప్పులు

యాలకులు – 2

లవంగాలు – 4

బిర్యాని ఆకు - 1

అనాస పువ్వు – 1

ఉల్లిపాయలు – 2

వెల్లుల్లిపాయలు - 2 టేబుల్ స్పూన్లు

1 టేబుల్ స్పూన్ జీడి పప్పు

తరిగి పెట్టుకున్న అర కప్పు టమాట

కొత్తిమెర – 1 టేబుల్ స్పూన్

పుదినా ఆకులు – 1 టేబుల్ స్పూన్

fresh cream - 2 టేబుల్ స్పూన్లు

కసూరి మేథి - 1 టేబుల్ స్పూన్

 తయారు చేసుకునే విధానం :

          750 గ్రాముల చికెన్ లో రెండు లెగ్ పీసులు కూడా వచ్చేటట్లు తీసుకొని వాటికి గాట్లు పెట్టుకోవాలి. లెగ్ పీసులు ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. లెగ్ పీసులు compulsory కాదు, కాని వీటిని తింటుంటే వచ్చే కిక్కే వేరప్పా... మిగతా చికెన్ ను మీడియం సైజు ముక్కలుగా కట్ చేయుంచుకోవాలి.

Ø   ఇలా కట్ చేయించి తీసుకొచ్చిన చికెన్ కు కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్  చేయడం వలన చికెన్ నీసు వాసన లేకుండా వుంటుంది.

Ø  క్లీన్ చేసుకున్న చికెన్ ను ఒక బౌల్ లోకి తీసుకొని సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టుకొని మారినేట్ చేసుకోవాలి.

TIP :  రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టే సమయం లేనప్పుడు, ఒక గంట deep ఫ్రిడ్జ్ లో ఉంచినా సరిపోతుంది. ఈ విధంగా చేయడం వలన చికెన్ tender and soft గా వుంటుంది.

Ø  ఒక కడాయ్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరిగాక, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యాని ఆకు, 1 అనాస పువ్వు వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి.

Ø  తరువాత ఈ కడాయ్ లోనే సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి కాసేపు ఫ్రై చేయాలి. అల్లం ముక్కలు, ఉల్లిపాయలు వేగాక 2 టేబుల్ స్పూన్ ల తొక్క ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీడి పప్పు, తరిగి పెట్టుకున్న అర కప్పు టమాట ముక్కలు, కొద్దిగా పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి.

Ø  తరువాత ఈ టమాట ముక్కలు soft గా, మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి.

Ø  టమాట ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత stove off చేసుకొని, ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని mixi jar లో వేసుకొని, దీనికి 1 టేబుల్ స్పూన్ కొత్తిమెర, 1 టేబుల్ స్పూన్ పుదినా ఆకుల్ని వేసుకొని, మరీ మెత్తని పేస్టు లా కాకుండా కొద్దిగా గరుకుగా ఈ మసాలా పేస్టు ని mixi పట్టుకోవాలి.

Ø  ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేయడానికి stove ఫై కడాయ్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మరిగించుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ బట్టర్ ని వేయాలి.

Ø  టిప్ : ఈ బట్టర్ వలెనే మనకు restaurant స్టైల్ చికెన్ టేస్ట్, flavour వస్తుంది.

Ø  బట్టర్ కరిగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాల, కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడవుగా చీల్చిన రెండు పచ్చి మిర్చి వేసిన తరువాత కొద్దిగా వేయించుకొని, దానిలోకి ఇంతకు ముందే మనం తయారు చేసుకొని పెట్టుకున్న మసాల పేస్టు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ ను వేసుకొని బాగా కలుపుతూ వుండాలి.

 


Ø  నూనె పైకి తేలుతున్నప్పుడు మనం marinate చేసుకున్న చికెన్ ను ఈ కడాయ్ లో వేసుకొని బాగా 2 సార్లు కలుపుకొని, కడాయ్ ఫై మూత పెట్టుకొని low to medium flameలో adjust చేసుకుంటూ 10 నుండి 15 నిమిషాల పాటు, ఈ చికెన్ లో నుంచి నీరు వచ్చి, ఆ నీరుతో చికెన్ అంతా complete గా ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ, కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి.

Ø  చికెన్ బాగా ఉడికిన తరువాత కూర లోంచి నూనె పైకి తేలుతున్నపుడు కొద్దిగా నీరు పోసుకొని చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని, ఉప్పు సరిపోకపోతే, సరిపడినంత కలుపుకొని మూత పెట్టి low flame లో 2 నుండి ౩ నిమిషాలు ఉడికించాలి.

Ø  చికెన్ కూర almost తయారు అయింది అనుకున్నపుడు, ఆ కూరలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల fresh cream, 1 టేబుల్ స్పూన్ కసూరి మేథిని crush చేసుకొని వేసుకోవాలి. ఇవన్ని వేసిన తరువాత కూర మొత్తం ఒకసారి కలుపుకొని, మూతపెట్టి మరో 2 నిమిషాల పాటు low flame లో ఉడికించుకోవాలి. ఆ తరువాత stove off చేసుకొని, కొత్తిమేరతో garnish చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.

Ø  అంతే, వేడి వేడి restaurant స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ తయార్..  

 


 

Post a Comment

0 Comments