Prawns Masala Curry | రొయ్యల మసాలా కూర in Telugu

 Prawns Masala Curry | రొయ్యల మసాలా కూర

హలో ఫ్రెండ్స్! ఈ రోజు బెస్ట్ రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. చాల చాల బాగుంటుంది. చాల tasty గా కుడా వుంటుంది. ఎంత తిన్న కుడా తనివి తీరదు .. అంత అద్భుతంగా వుంటుంది. చాల సింపుల్ టిప్స్ తో చాల రుచికరంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా సి ఫుడ్ ఇష్టపడే వాళ్లకి ఈ రొయ్యల కూర బాగ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి.

ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం..

ఇక్కడ వలిచి పెట్టుకున్న రొయ్యలు 400 గ్రాములు తీసుకున్నాను. ఇలా ఒకసారి రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక, ఇందులోకి అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా పసుపు, ఉప్పు తో కలిపి కడగం వలన రొయ్యలకి వున్నా నీచు వాసన పోతుంది. ఎక్కువగా రొయ్యలకి నీచు వాసన వుంటుంది. అది పోవడానికి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు, ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలి. 

 


     ఇప్పుడు
stove ఆన్ చేసి కడాయ్ ను stove మీద పెట్టుకొని కడాయ్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యాని ఆకు, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు,  1 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి బాగా దోరగా వేయించాలి. ఈ మసాల దినుసులు బాగా వేగిన తరువాత ఇందులోకి సన్నగా తరిగిన 2 medium సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 2 నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి లను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను వేసుకోవడం ఇష్టం లేకపోతే మెత్తగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. కాని ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా వేసుకోవడం వల్ల గ్రేవీ చాల బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేగుతుండ గానే ఒక టేబుల్ స్పూన్ దాక ఉప్పు వేసుకోండి. త్వరగా ఉల్లిపాయ ముక్కలు వేగుతాయి. కడాయ్ మీద మూతపెట్టి, రెండు నిమిషాల పాటు మీడియం flame లో వేగించుకున్నాక మూత తీసి ఒకసారి గరిటతో బాగా కలియ తిప్పాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఒక టేబుల్ స్పూన్ కి పైగా అల్లం వెల్లులి పేస్టు వేసుకొని బాగా కలపాలి. కొద్దిగా తరిగిన కొత్తిమెర, కరివేపాకు రెబ్బలు వేసుకొని గరిటతో తిప్పాలి. అల్లం వెల్లులి పేస్టు బాగా వేగినాక, 10 నిమిషాల పాటు ప్రక్కన పెట్టుకున్న రొయ్యల్ని కడాయ్ లో వేసుకోవాలి. రొయ్యల తో పాటే వున్న పసుపు, ఉప్పు నీళ్ళని మాత్రం కడాయ్ లో వేయకూడదు. ఎందుకంటే ఆ నీళ్ళని కూర లో కలిపారంటే, కూర మొత్తం కూడా నీచు వాసన వస్తుంది. ఇప్పుడు రొయ్యల్ని బాగా కలపాలి. ఈ రొయ్యల్ని తిప్పడానికి చెక్క గరిట వాడితే మంచిది. ఎందుకంటే రొయ్యలు ముక్కలుగా విరిగి పోకుండా చక్కగా వస్తాయి.

ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పును ఇదివరకే 2 సార్లు వేసాము. ఒకసారి రొయ్యలు శుభ్రం చేసుకొనేటప్పుడు, రెండోసారి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి .. కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పసుపు, కారం రొయ్యలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయ్ మీద మూత పెట్టి ౩ నిమిషాలు పాటు ఫ్రై చేయండి. మీడియం flame లోనే చేసుకోవాలి. ౩ నిమిషాల తరువాత మూత తీసి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటో లను వేసుకోవాలి. ఈ రొయ్యల కూరలోకి కొంత మంది చింతపండు రసం వాడతారు, నేను ఐతే ఇక్కడ టమాటో ముక్కలను వాడుతున్నాను.

 


టమాటో ముక్కలతో పాటు ఒక అర టీ స్పూన్ దాక జీలకర్ర పొడి, ముప్పావు టీ స్పూన్ దాక వేయించిన ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి medium flame లో ఉడికించుకోవాలి. అప్పుడు టొమాట బాగా soft గా ఉడికి పోతుంది. 2 నిమిషాల తరువాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ కూడా ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ రొయ్యల కొరకు సరిపడా నీటిని పోయాలి. నేను ఐతే ఒక కప్ నీరు పోసాను. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ గా కావాలంటే మరి కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి. గరం మసాల వేసిన తరువాత మూత పెట్టి సరిగ్గా 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు కూర కూడా బాగా దగ్గరకి ఉడికిపోతుంది. Medium flame లోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తరువాత మూత తీసి ఒక సారి చూద్దాం. రొయ్యలు బాగా ఉడికి పోయి, గ్రేవీ కూడా బాగా దగ్గర కి వచ్చింది. ఈ విధంగా ఉండగానే stove off చేసుకొని కొద్దిగా కొత్తిమెరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి.

అన్నంలోకే కాదు చపాతి, పుల్కా లోకి కూడా చాల బాగుంటుంది. ముఖ్యంగా సి ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ prawns మసాలా కర్రీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.

తయారికి కావలసిన పదార్ధాలు :

400 గ్రాముల రొయ్యలు

ఉప్పు

కారం

2 ఉల్లిపాయలు

2 పచ్చి మిరపకాయలు

1 బిర్యాని ఆకు

2 టేబుల్ స్పూన్ల ఆయిల్

ఒక దాల్చిన చెక్క,

3 లవంగాలు,

2 యాలకులు, 

1 టేబుల్ స్పూన్ల జీలకర్ర

2 టమాటో

గరం మసాల

అల్లం వెల్లుల్లి పేస్టు


 

Post a Comment

0 Comments