Tasty Mutton Curry :
మటన్ కర్రీ ఎప్పుడు చేసినా tasty గా కుదరాలంటే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఈ మట్టన్ కర్రీ అన్నం, చపాతి అలాగే బగార రైస్, జీర రైస్ లోకి అయినా చాలా అంటే చాల బాగుంటుంది. సింపుల్ way లో ఎలాగ చేయాలో చూపిస్తాను. ఎవ్వరైనా చాలా ఈజీ గా చేసేయవచ్చు.
మరి రుచికరమైన ఈ మటన్ కర్రీ చేసే తయారీ విధానం ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు :
500 గ్రాముల మటన్
పసుపు
కారం
ఉప్పు
అల్లం
మటన్ మసాలా
ఆయిల్
దాల్చిన చెక్క
పెరుగు
యాలకులు
లవంగాలు
ఉల్లిపాయలు
వెల్లుల్లిపాయలు
జీడి పప్పు
టమాట
కొత్తిమెర
· ముందుగా మటన్ ను కట్ చేసి, బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఇక్కడ నేను అర KG వరకు మటన్ ని తీసుకున్నాను. ఇలా కడిగి తీసుకొన్న మటన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ల వరకు కారం, అలాగే టేస్ట్ కి సరిపడా ఉప్పుని , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి ఒక సారి మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలిపాక, మూత పెట్టి ఒక అరగంట ప్రక్కన పెట్టేసుకుందాం.
· అర గంట తరువాత stove ఆన్ చేసి కుక్కర్ లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను మటన్ కర్రీ ఈజీ గా, క్విక్ గా అవ్వడానికి కుక్కర్ లో పెట్టేస్తున్నాను.
· ఆయిల్ వేడి అయ్యాక సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయల్ని వేసి medium flame లో బాగా fry చేయండి. ఇది లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు medium flame లో బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ లోకి వచ్చాక, ముప్పావు వంతు ఫ్రై అయిన ఉల్లిపాయల్ని వేరే బౌల్ లోకి తీసుకోవాలి.
· మిగిలిన ఉల్లిపాయల్ని కుక్కర్ లోనే ఒక ప్రక్కకు జరుపుకొని, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ౩ యాలకులు, 5 లవంగాలు, ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ని వేసి, 2 నిమిషాల ఫ్రీ చేయండి. ఇలాగ కొంచెం fry అయ్యాక ప్రక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఉల్లిపాయలని కూడా కలిపి ఫ్రై చేయండి.
· ఇప్పుడు ఇందులోకి marinate చేసినా మటన్ ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. మసాల పేస్టు మటన్ కి బాగా పట్టేలా గరిటతో 2 లేదా ౩ సార్లు తిప్పుతూ వుండాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి సన్నగా పొడవుగా చీల్చుకున్న 4 పచ్చి మిర్చి ని add చేయాలి. మరొకసారి గరిటతో బాగా కలపండి. ఇప్పుడు కుక్కర్ మూత కి వున్న రబ్బర్ ని, whistle ని తీసివేసి, మూత పెట్టి medium flame లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
· మరో ప్రక్కన మిక్సర్ జార్ లోకి మనం విడిగా తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఉల్లిపాయల్ని, ఒక 5 లేదా 6 జీడిపప్పు లను తీసుకోవాలి. జీడిపప్పులను వేసుకోవడం వలన మటన్ గ్రేవీ అనేది చాలా tasty గా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే గసగసాలని అర గంట నానబెట్టుకొని తీసుకోవాలి.
· ఇందులోనే కట్ చేసుకున్న ఒక టమాటో వేసి, మెత్తగా grind చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత ఒకసారి ఓపెన్ చేసుకొని, మనం grind చేసుకొని పెట్టుకున్న పేస్టు ని add చేసుకొని, మరొక్క సారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాల ని add చేయాలి. బాగా కలుపుకొని, కుక్కర్ మూత పెట్టుకొని, 5 నుండి 10 నిమిషాల వరకు medium flame లో ఉడికించాలి.
· 10 నిమిషాల తరువాత కుక్కర్ మూత తీసి చూసినప్పుడు, మటన్ నుండి ఆయిల్ సెపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఇలా చేయడం వలన ఉప్పు, కారం మటన్ కి పట్టి చాల టేస్ట్ గా వుంటుంది. గరిటతో కూర బాగా కలిపి, గ్రేవీ కి సరిపడా మరియు మటన్ బాగా ఉడకడానికి ౩5౦ ML నీటిని add చేసుకోవాలి.
· గ్రేవీ ఎక్కువ గా కావాలనుకుంటే మరి కొద్ది నీళ్ళు కలపండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమెర ఆకులను వేసి కలపండి. ఇప్పుడు కుక్కర్ మూత కి వుండే రబ్బర్ ని, whistle ని పెట్టుకొని మూత బిగించాలి. ౩ లేదా 4 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. లేత మటన్ తీసుకుంటే తొందరగానే ఉడుకుతుంది. అదే కొద్దిగా ముదురు మటన్ తీసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది.
· 6 whistles తరువాత కుక్కర్ మూత తీసివేసి, మటన్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కగా ఉండాలంటే మూత లేకుండా మరి కాసేపు ఉడికించండి. అప్పుడు గ్రేవీ చిక్కగా వస్తుంది.
· ఇప్పుడు ఒక బౌల్ లోకి మటన్ కర్రీ వేసుకొని, సర్వ్ చేసుకుందాం. చాల సింపుల్ గా, tasty గా మటన్ గ్రేవీ కర్రీ ని తయారు చేసుకోవడం ఎలాగో చుసేసారుగా. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. Thank You Friends.
0 Comments