Egg Curry Recipe in Telugu (కోడి గుడ్డు వెల్లుల్లి కారం)
ఈ రోజు మనం మంచి రుచి కరమైన కోడి గుడ్డు వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో
చూద్దాం రండి. చూస్తేనే నోరు ఊరి పోతుంది, చాల tasty గా వుంటుంది. దీన్ని మనం నిల్వ
కూడా చేసుకోవచ్చు. అన్నంలోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా
వుంటుంది. కాబట్టి ఈ రోజు మనం కోడి గుడ్డు వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో
, కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం ఒక సారి చూద్దాం.
· ముందుగా ఒక mixi జార్ తీసుకొని, ఒక టీ స్పూన్, జీలకర్ర, అర స్పూన్ మిరియాలు, ౩
లవంగాలు, రెండు యాలకులు వేసుకొని కచ్చ పచ్చగా (గరుకుగా) grind చేసుకోవాలి.
· ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు లో వుండే పొట్టు తీసిన వెల్లులిపాయను రెబ్బలుగా
విడతీసుకొని వాటిని mixi లో వేయాలి. దీనితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల కారం ను కూడా
వేయాలి.
· ఇప్పుడు కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకోవాలి. ముందుగా దీన్ని grind గా చేసుకోవాలి. ఇందులో
ఎలాంటి నీళ్ళు కలపాల్సిన అవసరం లేదు. వెల్లులిలో వుండే చెమ్మే సరిపోతుంది. ఇప్పుడు
వెల్లులి కారం రెడీ ఐపోయింది.
· ఇప్పుడు stove వెలిగించుకొని ఒక కడాయ్ లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.
నూనె వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర
వేసుకోవాలి. వేగిన తరువాత 2 ఎండు మిరపకాయలు, అలాగే 2 పచ్చి మిరపకాయలు కూడా
వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించాలి. పోపు వేగిపోయిన తరువాత ఇందులో
ఐదు లేదా ఆరు కోడి గుడ్డలను కొట్టి వేసుకోవాలి.
· ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి చల్లుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు medium flame లో
పెట్టుకోవాలి.
· ఇప్పుడు ఈ ఎగ్స్ ని లైట్ గా కోవాలి. మరీ పొడి పొడిగా కాకుండా కొద్దిగా పెద్ద సైజు లో
ఉండేలా విడదీసుకోవాలి.
· రెండో వైపు కూడా కాలే విధంగా తిప్పుకోవాలి.
· ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని అంతా ఒక వైపు జరుపుకొని, అదే కడాయ్ లో
ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లులి కారంను add చేసుకోవాలి.
· Medium flame లోనే వుంచుకొని, వెల్లుల్లి కారం fry చేసుకోవాలి.
· వెల్లుల్లి కారం అంతా వేగాక, అది మొత్తం కోడి గుడ్డు కూరకు పట్టే విధంగా mix
చేసుకోవాలి.
· వెల్లులి పచ్చి వాసన పోయే లాగా 4 నిమిషాలు గరిటతో అటూ, ఇటూ తిప్పుతూ fry
చేసుకోవాలి.
· చివరగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కూరంతా ఒకసారి బాగా కలుపుకోవాలి.
· Stove off చేసుకోవాలి. అంతే, మనకు నచ్చిన కోడిగుడ్డు వెల్లులి కారం రెడీ ఐపోయింది.
· వేడి వేడి అన్నంలోకి కోడిగుడ్డు వెల్లులి కారం తో పాటు, కొద్దిగా నిమ్మకాయ రసం
పిండుకొని వడ్ధించుకోవాలి.
· అంతే వేడి వేడి కోడిగుడ్డు వెల్లులి కారం తయార్. మీరు కూడా ఒక్క సారి తప్పకుండా ట్రై
చేయండి. చాలా బాగుంటుంది.
0 Comments