Chicken Dum Biryani in Telugu | చికెన్ ధం బిర్యాని తెలుగులో

 Chicken Dum Biryani in Telugu |  చికెన్ ధం బిర్యాని తెలుగులో

హాయ్ ఫ్రెండ్స్! నేను మీ హేమశ్రీ ... Welcome to hemarecipes.com ఈ రోజు మనం స్పెషల్ చికెన్ ధం బిర్యాని ని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. చేసే ప్రాసెస్ కుడా చాల తేలికగా వుంటుంది. మసాలా flavours తో ఘుమఘుమలాడే tasty బిర్యాని .. ఎంత చక్కగా కుదిరిందో.. అన్నం కూడా పొడి పొడిగా ఎంతో బాగుంటుంది. ఇక చికెన్ ముక్కలు జూసీ గా ఎంత తిన్నా కాని ఇంకా తినాలనిపించేలా మంచి రుచితో ఆహా... చూస్తేనే నోరు వూరిపోతుంది. చికెన్ ధం బిర్యాని చేయాలంటే complete గా చూసి ఇంట్లోనే ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా ఫిదా ఐపోతారు. మరి ఆలస్యం చేయకుండా ఈ స్పెషల్, tasty బిర్యాని ని ఎలా చేయాలో, ఆ తయారి ప్రాసెస్ ని ఇప్పుడు చూసేద్దాం.

 


ఈ చికెన్ బిర్యాని కోసం 750 గ్రాముల చికెన్ తీసుకున్నాను. చికెన్ ను 2 లేదా ౩ సార్లు కడగండి. ఇప్పుడు చికెన్ ని marinate చేసుకోవడానికి 9 లేదా 10 పచ్చి మిర్చిలను, కొద్దిగా కొత్తిమెర, పిడికిడంత పుదినా ఆకుల్ని ఒక మిక్సర్ గ్రైండర్ లోకి వేసుకొని పేస్టు లాగ చేసుకోవాలి. ఇలా grind చేసిన పేస్టుని చికెన్ ముక్కలు వున్న బౌల్ లో  వేసికొని దారికి 2 టీ స్పూన్ల fresh గా చేసిన అల్లం వెల్లులి పేస్టు, 1 టేబుల్ స్పూన్ గరం మసాల పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అర కప్పు పెరుగు, సగం నిమ్మకాయ రసం పిండి చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలియ తిప్పి అరగంట సేపు marinate చేసుకోవాలి.

                ఇప్పుడు మరొక పెద్ద గిన్నె తీసుకొని, దానిలోకి 2 గ్లాస్ ల (750 గ్రాములు) వరకు బాస్మతి బియ్యం తీసుకుందాం. మనం మంచి క్వాలిటీ వున్న బాస్మతి రైస్ తీసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ restaurant స్టైల్ లో వుంటుంది. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఈ రైస్ ఎంత ఐతే  తీసుకున్నామో దానికి రెండింతలు నీరు పోసుకోవాలి. అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీరు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి spices కూడా add చేసుకుందాం. 2 లేదా 3 దాల్చిన చెక్క ముక్కలు, 2 మొరాటి మొగ్గ, 1 ఇలాచి, 15 నుండి 20 వరకు మిరియాలు తీసుకోండి. అలాగే 5 లేదా 6 లవంగాలు, 1 టీ స్పూన్ వరకు షాజీర, జాపత్రి, 1 అనాస, 3 యాలకులు, 2 బిర్యాని ఆకులు మొదలైన మాసాలను కొద్ది కొద్దిగా తీసుకొని, బియ్యం వున్న నీటిలో వేసుకుందాం.

          అలాగే, టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నాను. మీరు, మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే అన్నం పొడి పొడిగా ఉండాలంటే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. కట్ చేసినా పచ్చి మిరపకాయలను కూడా add చేసుకోండి. మీకు నచ్చితే పచ్చి మిరపకాయలను వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇది పూర్తిగా మీ ఆప్షన్. అన్ని add చేసాక ఈ బియ్యాన్ని వెంటనే ఉడికించ కుండా ఒక అరగంట సేపు నాననిద్దాం.

          ఒక 20 నిమిషాల తరువాత, stove మీద పాన్ పెట్టి వేడెక్కాక దానిలోకి 4 నుండి 5 టీ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి పూర్తిగా కరిగాక ఒకటిన్నర కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా గరిటతో కలుపుతూ ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఈ ఫ్రై చేసిన ఉల్లిపాయలు బిర్యాని లోకి టేస్ట్ చాల బాగుంటుంది. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి అన్ని రకాల spices ని కొంచెం కొంచెం తీసుకోండి. అంటే 2 బిర్యాని ఆకులు, 10 మిర్యాలు, 4 యాలకులు, అర స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు, మొరాటి మొగ్గ, జాపత్రి మొదలైనవి. 

 

         వీటిని ఆయిల్ లో వేసి లైట్ గా ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక, ఇందులోకి మనం marinate చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు హై flame లో చికెన్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసాక, కడాయ్ పై మూత పెట్టి మరో 5 నిమిషాలు medium flame లో పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత మూత తీసినప్పుడు చికెన్ నుండి నీరు బయటికి రావడం చూడవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలలో, ముప్పావు వంతు ఉల్లిపాయలని చికెన్ కూరలో వేసి బాగా కలపండి.

          ఒకవేళ మీకు చికెన్లో నీళ్ళు తగ్గాయి అనుకొంటే, కొంచెం నీళ్ళని వేసి ఉడికించవచ్చు. ఇలా బాగా కలిపాక, మళ్లి మూత పెట్టి చికెన్ ఉడికే వరకు మంటను medium నుండి low flame లో పెట్టి, చికెన్ 80 నుండి 90 పెర్సెంట్ ఉడికించాలి. చికెన్ almost ఉడుకుతుంది అనేటప్పుడు, మరొక ప్రక్క వున్న రెండో stove ని ఆన్ చేసి, మనం ఇంతకు ముందే నానబెట్టుకొన్న బాస్మతి బియ్యం వున్న గిన్నెని stove మీద ఉంచాలి. రైస్ ఉడకడం మొదలయ్యాక, ఒక 60 నుండి 70 శాతం మాత్రమే ఉడికించాలి. ఒక బియ్యపు గింజని చేతిలోకి తీసుకొని ఉడికిందో లేదో అని చెక్ చేసినప్పుడు కొంచెం పలుకుగా, కొంచెం ఉడికినట్లుగా వుండాలి. ఇప్పుడు stove off చేసుకోవాలి. అలాగే 90% ఉడికిన చికెన్ వున్న stove ని కూడా off చేసుకోవాలి.

          ఇప్పుడు ధం బిర్యాని చేసుకోవడానికి ఒక fresh కడాయ్ ని stove మీద పెట్టుకొని stove వెలిగించుకోవాలి. ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడెక్కాక, నెయ్యిని గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి, మనం ఇదివరకే ఉడికించుకున్న బాస్మతి రైస్ ని జాలి గరిటె తో తీస్తూ  add చేసుకోవాలి.  ఒక సగం వరకు రైస్ ని తీసుకున్నాక ఇందులోకి కొత్తిమెర, పుదినా ఆకుల్ని, మన దగ్గర వున్న పావు వంతు ఫ్రైడ్ ఉల్లిపాయాలలో కొన్నింటిని వేసుకోవాలి. బిర్యాని అనేది కలర్ ఫుల్ గా రావడానికి కొంచెం కుంకుం పువ్వు కలిపిన వాటర్ ని add చేసుకోవాలి. అలాగే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేయాలి. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ ని, మరియు గ్రేవీని, ఆ రైస్ మీద సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరో లేయర్ లాగా మిగిలిన బాస్మతి రైస్ ని సమానంగా చికెన్ ని పూర్తిగా కవర్ చేసేలాగా వేసుకోవాలి. 

 

           ఇప్పుడు ఈ రైస్ మీద కొద్దిగా ఫ్రైడ్ ఉల్లిపాయలు, కొత్తిమెర, పుదినా ఆకుల్ని మరియు ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడంవలన బిర్యాని చాల టేస్ట్ గా వుంటుంది. అలాగే కొంచెం కుంకుం పువ్వు కలిపిన వాటర్ ని కూడా add చేసుకొండి. ఇప్పుడు దీనిపై పావు స్పూన్ గరం మసాల పౌడర్ ని చల్లుకోండి. అలాగే బాస్మతి రైస్ ని ఉడికించుకున్న తరువాత మిగిలిన వున్న నీటిని 2 లేదా 3 స్పూన్ల వరకు add చేసుకోండి. దీనివలన చికెన్ అయినా, రైస్ అయినా perfect గా ధం అవుతుంది. అలాగే రైస్ అనేది కూడా మాడి పోకుండా వుంటుంది. ఇప్పుడు కడాయ్ పైన పూర్తిగా కప్పి ఉంచడానికి సిల్వర్ ఫాయిల్ తో కవర్ అయ్యేలా చేసుకొని దానిపైన మూత పెట్టుకోవాలి. 

        సిల్వర్ ఫాయిల్ అందుబాటులో లేకపోతే దాని స్థానంలో గుడ్డతో కప్పి ఉంచవచ్చు లేదా పిండితో అయినా పూర్తిగా మూత చుట్టూ టైట్ గా కవర్ అయ్యేలా చేసుకోవచ్చు. మొదటి 2 లేదా 3 నిమిషాలు మంటను high flame లో పెట్టి, ఆ తరువాత 10 నుండి 12 నిమిషాలు ధం చేయండి. టోటల్ గా 14 లేదా 15 నిమిషాలలో చికెన్ ధం బిర్యాని రెడీ అయిపోతుంది.  15 నిమిషాల తరువాత కడాయ్ ఫై వున్న సిల్వర్ ఫాయిల్ ని తొలగించి చూస్తే ఘుమఘుమలాడే చికెన్ ధం బిర్యాని నోరు ఊరిస్తూ కనపడుతుంది.  వేడి వేడిగా వున్న ఛికెన్ ధం బిర్యాని వెంటనే సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయండి. మీరు కూడా ఇలాగే మంచి ఘుమఘుమలాడే చికెన్ ధం బిర్యాని ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్..

కావలసిన పదార్ధాలు :-

బాస్మతి రైస్

చికెన్

నెయ్యి

ఉల్లిపాయలు

పచ్చి మిర్చి

కొత్తిమెర

పుదినా

సిల్వర్ ఫాయిల్

అల్లం వెల్లులి పేస్టు,

గరం మసాల పౌడర్,

ఉప్పు, కారం,  పసుపు,

అర కప్పు పెరుగు

సగం నిమ్మకాయ రసం

కుంకుం పువ్వు

బిర్యాని ఆకులు, మిర్యాలు

యాలకులు, జీలకర్ర,

మొరాటి మొగ్గ, జాపత్రి

దాల్చిన చెక్క ముక్కలు

లవంగాలు మొదలైనవి...


 

Post a Comment

0 Comments